శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.24 కోట్ల కొకైన్ చాక్లెట్ల స్వాధీనం

Wednesday, September 30, 2026

Cocaine Worth ₹24 Crore Disguised as Chocolates Seized at Shamshabad Airport crime hyderabad telangana

t f B! P L

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను భగ్నం చేశారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా చాక్లెట్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.24 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. దోహా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలపై అనుమానం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది సహకారంతో సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని, అతని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో లగేజీని పరిశీలించిన అధికారులకు విచిత్రమైన వస్తువులు కనిపించాయి. విదేశాల నుంచి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు నిందితుడు తెలివిగా ప్లాన్ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కొకైన్‌ను అత్యంత చాకచక్యంగా చాక్లెట్ల రూపంలోకి మార్చి లగేజీ బ్యాగుల్లో భద్రపరిచాడు. ఇక తనిఖీల్లో పట్టుబడిన కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.24 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు.. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు? దీని వెనుక ఏమైనా అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ ఉందా? అనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ