మచిలీపట్నం నుంచి కర్నూలుకు కొత్త రైలు
Monday, September 28, 2026
cover a distance of 499 kilometers New Train from Machilipatnam to Kurnool operate three days a weekAndhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య విజయవాడ మీదుగా కొత్త ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. వారానికి 3 రోజుల పాటు ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ కొత్త మచిలీపట్నం-కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్ 499 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రైలు మచిలీపట్నం నుంచి సాయంత్రం 4:55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:45 గంటలకు కర్నూలు సిటీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు నుంచి ఉదయం 9:30 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9:35 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం, బుధవారం, శనివారం నడపనున్నారు. కర్నూలు సిటీ-మచిలీపట్నం రైలు మంగళవారం, గురువారం, ఆదివారం నడుస్తుంది. ఈ రైలుకు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచర్ల, డోన్ స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారు. ఈ కొత్త సర్వీస్‌తో మచిలీపట్నం, విజయవాడ, కర్నూలు సిటీ మధ్య కనెక్టివిటీ బలోపేతం అవుతుందని రైల్వే శాఖ తెలిపింది. అలాగే మార్గమధ్యంలోని పలు పట్టణాలు, నగరాలకు ప్రయాణికులకు అదనపు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.
No comments:
Post a Comment