కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

Monday, September 28, 2026

crime hyderabad Machabollaram Peddi Pharmareddy Colony telangana Wife Hacks Husband to Death Amidst Family Dispute within the limits of the Alwal police station

t f B! P L

హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి, మచ్చబొల్లారంలోని పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరడంతో భార్య తన భర్తను గొడ్డలితో హతమార్చింది. పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో శ్రీనివాస్, రమాదేవి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ విషయాలపై తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మరోసారి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో తీవ్ర ఆవేశానికి లోనైన రమాదేవి ఇంట్లో ఉన్న గొడ్డలితో శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హత్యకు గల అసలు కారణాలను ఆరా తీస్తూ, ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించారు. నిందితురాలు రమాదేవితో పాటు ఆమె ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ