ホーム
/
Police stated that the men subsequently took her in a car to a flat and committed the heinous act.
/
అజర్‌బైజాన్ యువతిపై లాహోర్‌లో సామూహిక అత్యాచారం
Monday, September 28, 2026
Gang-rape of Azerbaijani woman in Lahore international Police stated that the men subsequently took her in a car to a flat and committed the heinous act.
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో అజర్‌బైజాన్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వ్యాపార పనుల కోసం పాకిస్థాన్‌కు వచ్చిన ఆమెను ఇద్దరు మహిళలు కేఫ్‌కు తీసుకెళ్లగా, అక్కడ ముగ్గురు పురుషులు వారిని కలిశారు. అనంతరం ఆ యువతిని కారులో తీసుకెళ్లి ఓ ఫ్లాట్‌లో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారి అంజుమ్ బషీర్ తెలిపిన వివరాల ప్రకారం బాధిత యువతి సుమారు రెండు వారాల క్రితం అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి పాకిస్థాన్‌కు వచ్చింది. లాహోర్‌లోని రాయ్‌విండ్ ప్రాంతంలో ఉంటోంది. సెప్టెంబర్ 25న రాత్రి సుమారు 11 గంటలకు ఇద్దరు మహిళలు ఆమెను డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ (డీహెచ్‌ఏ) ప్రాంతంలోని ఓ కేఫ్‌కు తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు పురుషులు అక్కడికి వచ్చారు. కేఫ్‌లో సమయం గడిపిన అనంతరం యువతిని ఆమె నివాసానికి కారులో తీసుకెళ్తామని ఆ ముగ్గురు పురుషులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమెను మరో ఫ్లాట్‌కు తీసుకెళ్లి మత్తు పదార్థం ఇచ్చారని, అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అక్కడి నుంచి ఆమెను లాహోర్‌లోని ఘాజీ ఇంటర్‌చేంజ్ సమీపంలో వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు యువతి ఐఫోన్‌ను కూడా తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు అనుమానితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధాన నిందితుడిని గుర్తించినట్లు పోలీసు అధికారి అంజుమ్ బషీర్ తెలిపారు. నేరానికి ఉపయోగించినట్లు భావిస్తున్న కారును అతడి బంధువు ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. వారు దేశం విడిచి వెళ్లకుండా ముగ్గురు అనుమానితుల పేర్లను 'స్టాప్ లిస్ట్'లో చేర్చినట్లు తెలిపారు. బాధితురాలిని కేఫ్‌కు తీసుకెళ్లిన ఇద్దరు మహిళల పాత్రపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
No comments:
Post a Comment