పెరగనున్న సిమెంట్ ధరలు : బస్తాకు రూ. 5 నుండి రూ. 20 వరకు పెంపు

Tuesday, September 29, 2026

business Cement Prices Set to Rise financial research firm Centrum Broking revealed Hike of ₹5 to ₹20 Per Bag national

t f B! P L

దేశవ్యాప్తంగా సిమెంట్ కంపెనీలు మరో విడత బస్తాకు రూ. 5 నుండి రూ. 20 వరకు ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థ సెంట్రమ్ బ్రోకింగ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. జూలై, ఆగస్టు నెలల్లో దాదాపు స్థిరంగా ఉన్న సిమెంట్ ధరలు, సెప్టెంబర్‌లో నెలవారీగా బస్తాకు రూ. 7 పెరిగి రూ. 356కి చేరింది. దక్షిణాదిన అత్యధికంగా బస్తాకు రూ. 11 పెరగ్గా, ఇతర ప్రాంతాల్లో రూ. 5-9 మధ్య పెరిగాయి. అయితే, సెప్టెంబర్ నెల చివరి నాటికి సేల్స్ టార్గెట్ చేరుకునేందుకు డీలర్లు పాత ధరలకే స్టాక్ విక్రయించడంతో ఈ పెంపు ప్రభావం వినియోగదారులకు పూర్తిగా చేరలేదు. రాబోయే రోజుల్లో కంపెనీల బిల్లింగ్ రేట్లు పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశం ఉంది. అక్టోబర్‌లో కంపెనీలు ప్రతిపాదించిన ఈ కొత్త ధరల పెంపు డీలర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. నిర్మాణ పనుల వేగం, డిమాండ్, పెరిగిన ధరలను అమలు చేయడానికి డీలర్లు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారనే దాన్ని బట్టి ఉంటుందని పేర్కొంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ