మాదాపూర్‌లో యువతి మృతి కేసు : పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియురాలని హత్య చేసిన ప్రియుడు : పరారైన ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Tuesday, September 29, 2026

Boyfriend kills girlfriend after she asks for marriage Case of young woman's death in Madhapur crime hyderabad police arrest the absconding boyfriend telangana

t f B! P L

హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధిక్‌నగర్‌లో ఓయో రూమ్‌లో ప్రియురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియురాలని హత్య చేసి పరారైన ప్రియుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్స్పెక్టర్ సుబ్బారావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 21న ఓయో రూమ్‌లో శరణ నిఖితతో కలిసి రవి తేజ ఓయో రూంకు వెళ్లారు. అక్కడ ఇరువురి మధ్య గొడవ జరిగి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమెను రవితేజ అపోలో ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. విషయం తెలుసుకున్న రవితేజ యువతి మృతదేహాన్ని వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. శరణ నిఖిత, రవితేజతో నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆమె కోరడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రవితేజ ఆమెపై దాడికి పాల్పడి తీవ్రంగా చితకబాదాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రవితేజను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ