ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో రాజకీయాల శైలి భిన్నంగా ఉంటుంది : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

Monday, September 28, 2026

' on the theme 'India's Next Chapter Political styles differ between North and South India Speaking at the 'Pratidin Conclave' in Delhi Telangana CM Revanth Reddy

t f B! P L

ఢిల్లీ వేదికగా జరిగిన 'ప్రతిదిన్ కాంక్లేవ్'లో 'ఇండియాస్ నెక్స్ట్ చాప్టర్' అనే అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తన రాజకీయ ప్రయాణం, విద్యార్థి రాజకీయాలు, జాతీయ రాజకీయాలపై అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను 2006లో జడ్పీటీసీగా, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచానని, ఆ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించానని సీఎం రేవంత్‌ గుర్తు చేసుకున్నారు. 2014 తర్వాత తెలంగాణ రాజకీయాలు 'కేసీఆర్ వర్సెస్ రేవంత్'గా మారాయని, ఆ సమయంలో కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపారని సీఎం ఆరోపించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు, కేంద్రంలో ఎన్డీఏతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో రాజకీయాల శైలి భిన్నంగా ఉంటుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విద్యార్థి సంఘాల ప్రభావం చాలా తక్కువగా ఉందని, ప్రధానంగా లెఫ్ట్, రైట్ విద్యార్థి సంఘాలే ఉన్నాయని.. ఎన్ఎస్‌యూఐ ప్రభావం పెద్దగా లేదన్నారు. యూనివర్సిటీ రాజకీయాలు వేరు, గ్రామ రాజకీయాలు వేరని స్పష్టం చేశారు. స్టూడెంట్ పాలిటిక్స్‌లో ఏబీవీపీ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ, సాధారణ రాజకీయాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీదే పైచేయి ఉంటుందని, తెలంగాణలో బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం లేదని అన్నారు. ఏబీవీపీలో గెలిచిన కొందరు విద్యార్థి నాయకులు తర్వాత కాలంలో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న ఉదాహరణలను ప్రస్తావించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తన అనుబంధాన్ని సీఎం రేవంత్ గుర్తుచేసుకున్నారు. రాహుల్ గాంధీని తొలిసారి కలిసినప్పుడు ఆయనతో 15 నిమిషాలు మాట్లాడానని, ఆ రోజే రాహుల్‌ను తన నాయకుడిగా నిర్ణయించుకున్నానని తెలిపారు. రాహుల్ గాంధీకి ఎలాంటి వ్యక్తిగత అజెండాలు లేవని, దేశమే ఆయనకు ముఖ్యమని రేవంత్ ప్రశంసించారు. అలాగే రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ తన శ్రేయోభిలాషులని ఆయన వెల్లడించారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ