సెప్టెంబర్ 29న హెచ్‌ఎమ్‌డీ వైబ్ 2 ప్రో 5జీ విడుదల

Sunday, September 27, 2026

business company has planned this launch with Flipkart's 'Big Billion Days' customers in mind HMD Vibe 2 Pro 5G Launching on September 29 technology

t f B! P L

దేశీయ మార్కెట్లో సెప్టెంబర్ 29న హెచ్‌ఎమ్‌డీ వైబ్ 2 ప్రో 5జీ లాంచ్ కాబోతోంది. పండుగల సీజన్‌కు ముందే బడ్జెట్ 5జీ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన టీజర్లు స్టార్ట్ అయ్యాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 6,000mAh బ్యాటరీ, 64MP ప్రైమరీ కెమెరా రానున్నట్లు టీజర్లు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో పాటు మూడు కలర్లలో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' కస్టమర్లే లక్ష్యంగా కంపెనీ ఈ లాంచ్ ప్లాన్ చేసింది. ప్లస్, బ్లాక్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అక్టోబర్ 8 నుంచే ఎర్లీ యాక్సెస్ లభించనుంది. మొదటి సేల్ కూడా ఇదే సమయంలో మొదలయ్యే అవకాశం ఉంది. కార్డ్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లతో ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. సేల్స్ సీజన్ పీక్స్‌కి చేరకముందే భారీ బ్యాటరీ, బెస్ట్ కెమెరా ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోవడమే హెచ్‌ఎమ్‌డీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ 120Hz డిస్‌ప్లే ఉండనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా తెలుస్తోంది. ఫ్లాట్ ఛాసిస్ డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్‌లో టైప్-సి పోర్ట్, స్పీకర్ గ్రిల్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి. బ్యాటరీ విషయానికొస్తే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రానుంది. సాఫ్ట్‌వేర్ పరంగా 22 భారతీయ భాషలకు సపోర్ట్ చేసే 'సర్వమ్ ఏఐ' పవర్డ్ ఇండస్ ఫీచర్‌తో ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌పై ఇది రన్ కానుంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ