రాజస్థాన్‌కు సింగరేణి విద్యుత్‌ను ధారాదత్తం చేయడం ప్రజాద్రోహమే : సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

Wednesday, September 30, 2026

Handing over Singareni power to Rajasthan is a betrayal of the people Harish Rao's open letter to CM Revanth Reddy telangana

t f B! P L

రాజస్థాన్‌కు సింగరేణి విద్యుత్‌ను ధారాదత్తం చేయడం ప్రజాద్రోహమేని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మన రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేయడం ప్రజా వ్యతిరేక చర్య కాక మరేమిటి అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బొగ్గు మనది, నీళ్లు మనవి, స్థలం మనది. కానీ మంచిర్యాల్ జైపూర్ (సింగరేణి)లో తయారయ్యే 800 మెగావాట్ల కరెంటు మాత్రం రాజస్థాన్‌కా అని నిలదీశారు. తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిచ్చినట్టు సొంత రాష్ట్రంలో కరెంటు ఇవ్వలేక రాజస్థాన్‌కు విద్యుత్‌ను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి (జైపూర్) కరెంటును రాజస్థాన్‌కు కట్టబెట్టే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సొంత రాష్ట్రంలో రైతులు కరెంటు లేక ఇబ్బందులు పడుతుంటే ఇతర రాష్ట్రాలకు కరెంటును ఎలా ధారాదత్తం చేస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణి నుంచి దాదాపు 22 వేల కోట్ల పెట్టుబడిని రాజస్థాన్ అభివృద్ధికి ఎందుకు మళ్లించాలి? రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కనీసం 7-8 గంటలు కూడా ఇవ్వలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం అని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ కోతలతో పవర్ హాలిడేలు ప్రకటిస్తూ.. మీ పాలనా వైఫల్యాన్ని ఎల్‌నినో మీదకు నెట్టి తప్పించుకుంటారా? అని నిలదీశారు. మీ నిర్వహణ లోపం వల్లే కేసీఆర్ ఎంతో ముందుచూపుతో నిర్మించిన విద్యుత్ కేంద్రాలు నేడు కునారిల్లుతున్నాయన్నారు. యాదాద్రి ప్లాంటుకు జీ10, జీ11 గ్రేడ్ బొగ్గు వాడాలి.. కానీ నాసిరకం జీ13, జీ14 బొగ్గు వాడి బాయిలర్లు దెబ్బతినేలా చేస్తున్నారని, కృతిమ బొగ్గు కొరత సృష్టించి కొత్తగూడెం 800 MW, భద్రాద్రి 540 MW కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిపేశారని ధ్వజమెత్తారు. థర్మల్ కేంద్రాల్లో 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు కాదు కదా, కనీస నిల్వలు కూడా లేకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బీఆర్ఎస్ పార్టీ వెళ్తే, పోలీసులను పెట్టి అడ్డుకోవడం మీ నియంతృత్వానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రానికి ఎలాంటి అదనపు భారం లేకుండా ఎన్‌టీపీసీ ఇచ్చే 1600 మెగావాట్ల కరెంటును వద్దు అని చెప్పడానికి మీరెవరు? రాష్ట్ర విభజన హామీ ప్రకారం ఎన్టీపీసీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ కోసం తక్షణమే పీపీఏ ఒప్పందం చేసుకోవాలన్నారు.రాజస్థాన్ విద్యుత్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోకపోతే.. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తీవ్ర పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ