స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం !

Tuesday, September 29, 2026

​​Andhra Pradesh Minister Bala Veeranjaneya Swamy We are committed to the welfare of Village and Ward Secretariat employees

t f B! P L

స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎటువంటి సర్వీస్ రూల్స్ లేకుండా 1.24 లక్షల మందిని నియమించి నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సచివాలయ వ్యవస్థను, ఉద్యోగుల సర్వీసులను స్ట్రీమ్‌లైన్ చేస్తున్నామని వెల్లడించారు. సచివాలయ ఉద్యోగులు తాజాగా విజయవాడలో నిర్వహించిన ఆందోళన పైన ప్రభుత్వం ఆగ్రహం గా ఉంది. కొందరు ఉద్యోగుల పైన చర్యలకు సిద్దం అవుతోంది. ఇదే సమయంలో సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన అంశాల పైన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందిస్తూ కీలక అంశాలను వెల్లడించారు. సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 15,000కు పైగా ప్రమోషన్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆరు సంవత్సరాల స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్‌కు అనుమతి ఇచ్చామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ.150 కోట్ల ఆర్థిక భారం పడుతోందని చెప్పారు. ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్, వేగవంతమైన క్యాజువల్ లీవ్ మంజూరు విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతినెల 2, 4వ బుధవారాల్లో డైరెక్టర్ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించడమే జీవో 11 ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తున్నప్పటికీ ధర్నాలు చేయడం, అమానవీయంగా వ్యవహరించడం వెనుక ఉన్న శక్తులు ఎవరని ప్రశ్నించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ప్రభుత్వ నిర్ణయాలను, పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని స్పష్టం చేసారు. ఉద్యోగులను రెచ్చగొడుతూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలోనే ప్రమోషన్ ఛానల్స్, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, సెలవుల సదుపాయాలు కల్పించామన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్, కేడర్ మార్పులపై గతంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై ఇప్పటికే చర్చలు జరిపి పలు అంశాలను పరిష్కరించామని తెలిపారు. విపత్తులు, అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతని స్పష్టం చేసారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ