ఆసియా క్రీడలు : మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నీరు ధండా

Tuesday, September 29, 2026

Asian Games created history by becoming the first Indian woman national Neeru Dhanda Wins Gold in Women's Trap Individual Event sports

t f B! P L

జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్ నీరు ధండా మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఫైనల్ రౌండ్‌లో నీరు ధండా 28 స్కోరు సాధించి నూతన ఆసియా రికార్డును నెలకొల్పింది. ఈ పోటీలో చైనాకు చెందిన యునాంగ్ సున్ (26) రజతం సాధించగా, కువైట్‌కు చెందిన హజర్ అబ్దుల్ మాలిక్ (21) కాంస్య పతకం గెలుచుకుంది. ఈ విజయంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు ఐదో స్వర్ణ పతకం లభించింది. మహిళల ట్రాప్ టీమ్ విభాగంలో నీరు ధండా, ఆషిమా అహ్లావత్, మనీషా కీర్‌లతో కూడిన భారత బృందం మొత్తం 328 పాయింట్లు సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో చైనా 346 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, కువైట్ 325 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. వ్యక్తిగత విభాగం క్వాలిఫైయింగ్ రౌండ్‌లో నీరు ధండా 118 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, ఆమె సహచరులు ఆషిమా అహ్లావత్ (106), మనీషా కీర్ (104) ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. ఇప్పటి వరకు భారత్ మొత్తం 47 పతకాలను (5 స్వర్ణాలు, 21 రజతాలు, 21 కాంస్యాలు) సాధించింది. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ