తోటి జవాన్ జరిపిన కాల్పుల్లో నలుగురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి
Wednesday, September 30, 2026
Four CISF Personnel Killed in Shooting by Colleague hydroelectric project camp in the Basholi area of Kathua district Jammu and Kashmir national
జమ్మూ కశ్మీర్‌లోని కతువా జిల్లా బశోలి పరిధిలోని హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ క్యాంప్ దగ్గర తోటి జవాన్ జరిపిన కాల్పుల్లో నలుగురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. షిఫ్టుల మార్పు జరిగే సమయంలో సీఐఎస్‌ఎఫ్ జవాన్ల మధ్య తలెత్తిన ఓ చిన్న వివాదం.. ఈ దారుణానికి దారి తీసినట్టు తెలుస్తోంది. జవాన్ల మధ్య వాగ్వాదం పెద్దదిగా మారి కాల్పుల వరకూ వెళ్లింది. 2009 బ్యాచ్‌కు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ అవధేష్ సింగ్.. తన సర్వీస్ వెపన్‌తో తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుల్ రఫీక్ అహ్మద్, కానిస్టేబుల్ సందీప్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ కూడా అంతర్గత విచారణ చేపట్టింది. సీఐఎస్ఎఫ్ డీజీ.. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. అసలు వాగ్వాదం ఎందుకు జరిగింది..? కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది తెలియాల్సి ఉంది. హెడ్ కానిస్టేబుల్ బ్యాక్‌గ్రౌండ్‌పైనా ఆరా తీస్తున్నారు అధికారులు. ఈ ఘటన జరగడానికి కారణాలేంటనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment