ముంబై పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరి యువకులు దుర్మరణం
Sunday, September 27, 2026
incident occurred at a BMC-run public toilet near the Parsi Panchayat Gate maharashtra Police suspect that a chemical gas leak caused their deaths Two Youths Die Tragically in Mumbai Public Toilet
ముంబైలోని రామ్ మందిర్ ఈస్ట్ ప్రాంతంలో ఓ పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. రసాయన వాయువు లీక్ అవడంతోనే వారు మృతి చెందారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృణాల్ తాయీ వంతెన సమీపంలోని పార్సీ పంచాయత్ గేట్ దగ్గర ఉన్న బీఎంసీకి చెందిన బహిరంగ మరుగుదొడ్డిలో ఈ ఘటన జరిగింది. అక్కడి నుంచి బలమైన రసాయనలు విడుదలవుతున్నట్టు స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే ఆ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు స్పృహ తప్పి పడిఉన్నారు. మృతులను ప్రభాకర్ ధనివర్ (24), భవిన్ దేశాయ్ (18)గా గుర్తించారు. ఇద్దరినీ ట్రామా కేర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. టాయిలెట్ నుంచి వచ్చిన విషపూరిత వాయువు కారణంగానే ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏ రసాయనం లీక్ అయింది, దాని మూలం ఏమిటి అనేది నిర్ధారణ కాలేదు. అయితే సమీపంలోని చిన్న పారిశ్రామిక యూనిట్ నుంచి వెలువడిన విషపూరిత వాయువు టాయిలెట్ ప్రాంతానికి చేరి ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, బీఎంసీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి రసాయన వాయు నమూనాలను సేకరించే చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతికి అసలు కారణాన్ని నిర్ధారించేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment