పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి : 11 మంది మృతి, 30 మందికి గాయాలు
Saturday, September 26, 2026
11 dead 30 Injured international Suicide attack in Pakistan terrorist organization Tehreek-e-Taliban Pakistan claimed responsibility for the attack
పాకిస్తాన్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన పాక్, ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని, డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో శనివారం జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామే అని టీటీపీ (తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్) అనే ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. పాక్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ఆత్మాహుతి పాల్పడేందుకు సిద్ధమైన ఒక ఉగ్రవాది భారీ పేలుడు పదార్థాలున్న వాహనంతో రోడ్డు పక్కన ఉన్న ఒక పోలీస్ చెక్‌పోస్టు వద్దకు దూసుకొచ్చాడు. అనంతరం తనను తాను పేల్చుకున్నాడు. ఇదే సమయంలో వాహనంలో ఉన్న పేలుడు పదార్థాలు కూడా ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో భారీ పేలుడు సంభవించి 11 మంది మరణించగా.. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించారు.
No comments:
Post a Comment