Posts

Showing posts with the label 'price stabilization scheme' to safeguard both airlines and passengers

మళ్లీ పెరగనున్న విమాన టికెట్ ధరలు !

Image
వి మాన ఇంధనం ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దాదాపు 10 శాతం మేర పెంచేశాయి. ఈ ప్రభావం నేరుగా సాధారణ ప్రయాణికులపై పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంధన ధరలు పెరిగితే కంపెనీలు ఆ భారాన్ని ఫ్లైట్ టికెట్ రూపంలో కస్టమర్ల పైనే వేస్తాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా మారుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలను, ప్రయాణికులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త 'ధరల స్థిరీకరణ పథకాన్ని' తీసుకొచ్చింది. దీని ప్రకారం విమాన సంస్థలు తమ ఇంధన ధరలను మూడు సంవత్సరాల వరకు ఒకే రేటు వద్ద లాక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఐచ్ఛిక స్కీమ్ కింద, ఇందులో చేరే విమానయాన సంస్థలు లీటర్ ఏటీఎఫ్ కు రూ.115 స్థిర ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇది రూ.104.927 గా ఉండేది. అంటే దాదాపు 10 శాతం పెరిగింది. ఈ పథకంలో చేరిన కంపెనీలకు అంతర్జాతీయంగా రేట్లు ఎంత పెరిగినా మూడేళ్ల వరకు లీటర్ రూ.115 కే ఇంధనం లభిస్తుంది. ఒకవేళ ఈ స్కీమ్‌లో చేరకుండా విడిగా మార్కెట్ రేటుకే కొంటామనే కంపెనీలకు ప్రస్తుతం లీటర్ ధర రూ.142Palగా ఉంది.