Posts

Showing posts with the label Bollywood actor Aamir Khan

ముగిసిన ప్రదీప్ రావత్ అంత్యక్రియలు

Image
ప్ర ముఖ నటుడు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముంబైలో అత్యశ్రునయనాల మధ్య ముగిశాయి. ‘సై’ చిత్రంలో భిక్షూ యాదవ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు విలనిజం నిర్వచనాన్ని సరికొత్తగా పరిచయం చేసిన ఆయన, తన నటనా ప్రతిభతో చెరగని ముద్ర వేశారు. ‘ఛత్రపతి’, ‘గజిని’, ‘భద్ర’, ‘యోగి’, ‘లక్ష్మి’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ప్రతికూల పాత్రలు పోషించి, కథానాయకుడికి సరిసమానమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. విలన్‌గా తెరపై ఆయన చూపించిన తీవ్రత, డైలాగ్ డెలివరీ ఆయనను సగటు విలన్ల కంటే భిన్నమైన ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ముంబైలో జరిగిన ఆయన అంతిమయాత్రలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌తో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని అశ్రునయనాలతో నివాళులర్పించారు.