వచ్చే వారం మంత్రివర్గ విస్తరణ : సీఎం డీకే శివకుమార్ ప్రకటన
క ర్ణాటక రాష్ట్ర మంత్రివర్గాన్ని రాబోయే వారంలో విస్తరించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. చిత్రదుర్గ వేదికగా జరిగిన బెంగళూరు రీజనల్ డివిజన్ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడిస్తూ, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మంత్రులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గ విస్తరణ తక్షణమే పూర్తి కానుందని, ఆ వెంటనే మంత్రులందరూ సమష్టిగా బాధ్యతలు నిర్వర్తించాలని సీఎం స్పష్టం చేశారు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వడ్డికెరె గ్రామంలో స్వయంగా పర్యటించిన ఆయన, రైతులపై కరువు చూపుతున్న ప్రభావాన్ని పరిశీలించారు. ప్రభుత్వ యంత్రాంగం, శాసనసభ్యులు అంతా కలిసికట్టుగా ‘టీమ్ కర్ణాటక’ స్ఫూర్తితో పనిచేయాలని, ప్రజా పాలన ప్రతి పౌరుడి గడపకూ చేరేలా ‘ప్రజా సేవా’ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 1 కోటి వరకు ఖర్చు చేసే అధికారాన్ని జిల్లా యంత్రాగానికి కల్పించినట్లు డీకే శివకుమార్ గుర్తుచేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన బోరుబావుల జీపీఎస్ వివరాలను తప్పనిసరిగా నమో...