2026 అక్టోబరు నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం !
2026 అక్టోబరు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని అధికారులకు చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్‌లో పోలవరం చేరుకున్న సీఎం, వస్తూనే విహంగ వీక్షణం చేశారు. ఆ తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర అధికారులతో కలిసి వ్యూపాయింట్‌కు వెళ్లారు. పోలవరం గ్యాప్1 పనులను పరిశీలించి.. ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి, అక్కడి పనులు పరిశీలించారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి, పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూల్‌ను ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యపడుతుందన్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని ...