1,800 మంది డ్రైవర్లు, సహాయక సిబ్బందిని కోటీశ్వరులను చేసిన ఇన్ఫోసిస్
ఇ న్ఫోసిస్ సంస్థలో పని చేసిన డ్రైవర్లు, ఎలక్ట్రిషిన్లు, సహాయ సిబ్బంది కూడా కంపెనీ ఈసాప్స్ ఇచ్చింది. ఈసాప్ షేర్లతో చాలా మంది కోటీశ్వరులుగా మారారు. ఇన్ఫోసిస్ ఐపీఓ 1993లో వచ్చింది. 1994లో ఇన్ఫోసిస్ భారతీయ కార్పొరేట్ చరిత్రలో మొదటిసారిగా తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల కోసం ఎంప్లాయీ షేర్ ఓనర్‌షిప్ ప్లాన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగులకు ఈసాప్స్ కేటాయించడంలో అప్పటి ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ కీలకంగా వ్యవహరించారు. షేర్లను కేవలం పెద్ద పెద్ద ఉద్యోగులకే కాకుండా సంస్థళో పని చేసే ప్రతి చిన్న ఉద్యోగికి స్టాక్ ఆప్షన్లు ఇచ్చారు. తమ కంపెనీలో పని చేసే వారిని ధనవంతులుగా ఎదగడానికి అవకాశం కల్పించింది. ఇన్ఫోసిస్ 1999లో మార్చిలో వరల్డ్ లోనే రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నాస్ డాక్ లో లిస్ట్ అయింది. అంతే కాదు నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ కంపెనీ పనితీరు బాగుండడంతో షేర్ ప్రైస్ కూడా భారీగా పెరిగింది. ఐపీఓ టైమ్ రూ.95 ఉన్న స్టాకా ప్రైస్ 6 సంవత్సరాల్లో రూ.8,100 కు చేరింది. దీంతో ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, డ్రైవర్ల...