Posts

Showing posts with the label 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా మారవచ్చని

ఆంధ్రప్రదేశ్ కి తుఫాన్ ముప్పు !

Image
ఆం ధ్రప్రదేశ్ లో శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అది క్రమేణ తీవ్ర వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారేందుకు అవకాశం ఉందని, ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా మారవచ్చని, అక్టోబర్ 17 నాటికి తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారుల అంచనా. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఆస్కారముందని తెలిపింది. ఒకవేళ వాయుగుండం కాస్తా తుపానుగా బలపడితే వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. తుఫన్ ఏపీ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో తీరం దాటవచ్చని, అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుపానుపై మరింత క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు.  మరోవైపు పల్నాడు, శ్రీసత్యసాయి, ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరితో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.