Posts

Showing posts with the label 42 U.S. Military Aircraft Destroyed in Iran Conflict

ఇరాన్ యుద్ధంలో 42 అమెరికా సైనిక విమానాలు ధ్వంసం

Image
ఇ రాన్ యుద్ధంలో ఎంత నష్టం సంభవించిందో అమెరికా అధికారికంగా బయటపెట్టలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం, ఈ యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ చెబుతున్న దాని ప్రకారం యుద్ధంలో ఫైటర్ జెట్లు, డ్రోన్‌లతో సహా కనీసం 42 అమెరికా సైనిక విమానాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ సైనిక చర్యకు ఇప్పటికే దాదాపుగా 29 బిలియన్ డాలర్లు ఖర్చు అయినట్లు పెంటగాన్ ప్రకటించింది. ధ్వంసమైన యుద్ధ విమానాల్లో అమెరికా అత్యాధునిక F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌లు నాలుగు, ఒక F-35A లైట్నింగ్ II ఫైటర్ విమానం, ఒక A-10 థండర్‌బోల్ట్ II గ్రౌండ్-ఎటాక్ విమానం, ఏడు KC-135 స్ట్రాటోట్యాంకర్ ఏరియల్ రీఫ్యూయలింగ్ విమానాలు, ఒక E-3 సెంటినల్ ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్-అండ్-కంట్రోల్ సిస్టమ్ (AWACS) విమానం, రెండు MC-130J కమాండో II స్పెషల్ ఆపరేషన్ విమానాలు, ఒక HH-60W జాలీ గ్రీన్ II వార్ రిసెర్చ్-రక్షణ హెలికాప్టర్, 24 MQ-9 రీపర్ డ్రోన్, ఒక MQ-4C ట్రైటాన్ డ్రోన్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే అమెరికా రక్షణ శాఖ ఇప్పటి వరకు యుద్ధ నష్టాలపై సమగ్ర అంచనాలను ప్రచురించలేదు. అమెరికా కాంగ్రెస్, కమిటీలు రక్షణశాఖ, అమెరికా సె...