Posts

Showing posts with the label 100

ఐదు నెలల్లో లక్ష ఉద్యోగాలు మాయం : లేఆఫ్.ఫై ట్రాకర్ వెల్లడి

Image
2026 ప్రారంభం నుంచి ఐదు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 1,16,000కు పైగా ఉద్యోగులు జాబ్స్ కోల్పోయినట్లు లేఆఫ్.ఫై ట్రాకర్ వెల్లడించింది. లక్షలాది ఉద్యోగాలు పోవడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందడం అని తెలుస్తోంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కూడా కొన్ని పెద్ద కంపెనీలు ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. మార్చి నెలలో మాత్రమే 46,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. మే నెలలో 28,000 ఉద్యోగాలు తొలగింపులు జరిగాయి. భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా, పేపాల్, సిస్కో, ఇంట్యూట్, క్లౌడ్‌ఫ్లేర్, లింక్డ్ఇన్, ఉబర్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఉబర్ తన పీపుల్ అండ్ ప్లేసెస్ డివిజన్‌లో సుమారు 23 శాతం సిబ్బందిని తగ్గించింది. సిస్కో 4,000 ఉద్యోగాలను తొలగిస్తూ, అదే సమయంలో కృత్రిమ మేధస్సు, సెక్యూరిటీ రంగాల్లో పెట్టుబడులను పెంచుతున్నట్లు ప్రకటించింది. పేపాల్ అయితే రానున్న రోజుల్లో మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు, తన ప్రణాళికను కూడా వెల్లడించింది. మెటా కంపెనీ కూడా తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో భారీ మొత్తంలో తగ్గ...

పెళ్లి వేడుకలో డబ్బులు వెదజల్లిన నిర్వాహకులు !

Image
ఉ త్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సిద్ధార్థనగర్‌లోని దేవల్వా గ్రామంలో ఓ పెళ్లి సందర్భంగా తీసిన వీడియో ఇది. ప్రస్తుతం ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనికి కారణం పెళ్లి ఊరేగింపులో ఆ కుటుంబీకులు చేసిన హడావుడి పెళ్లి బరాత్‌ సందర్భంగా వారు దాదాపు ఇరవై లక్షల రూపాయల నోట్ల కట్టలు గాలిలోకి వెదజల్లారు. పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న వ్యక్తులు కొందరు ఇంటి పైకప్పు, జేసీబీలపైకి ఎక్కి మరీ కరెన్సీ నోట్ల కట్టలను గాలిలోకి విసిరారు. ఇదంతా కొందరు వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్‌ చేయగా ఇప్పుడు అది వైరల్ అవుతోంది. వీడియోలో చాలా మంది గాలిలోకి నోట్లు విసురుతున్నట్లు కనిపిస్తోంది. 100, 200, 500 రూపాయల నోట్లను గాలిలోకి విసిరినట్లు సమాచారం. ఇందుకోసం వారు జేసీబీని కూడా పిలిపించారు. కొందరు దానిపై నిలబడి, మరికొందరు బిల్డింగ్ పైకప్పుపై నిలబడి కరెన్సీ నోట్లను జల్లుతున్నారు. ఈ నోట్లను సేకరించేందుకు చాలా మంది తరలివచ్చారు. వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్‌ చేశారు. అతను అంత పెద్ద దాత అయితే, కొంతమంది పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండాల...

హర్యానాలో ఆకర్షణీయ పథకాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల !

Image
హ ర్యానాలో కాంగ్రెస్ కు కౌంటర్ గా బీజేపీ తమ మేనిఫెస్టోలో ఆకర్షణీయ పథకాలను ప్రకటించింది. లడో లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని హామీ ఇచ్చింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, హర్‌ ఘర్‌ గృహిణి యోజన కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. హర్యానాకు చెందిన ప్రతీ అగ్నివీర్‌కు కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొంది. సంకల్ప పత్ర పేరిట రోహ్‌తక్‌లో ఈ మేనిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. హర్యానాకు చెందిన బలహీన వర్గాలు, ఎస్సీ-ఎస్టీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు దేశంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడ ఇంజనీరింగ్‌ లేదా వైద్య విద్య అభ్యసించినా వారికి స్కాలర్‌షిప్స్‌ అందిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అదే విధంగా 24 పంటలకు కనీస మద్దతు ధర కల్పనకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్లు నిర్మాణం..ఇండస్ట్రియల్ మోడల్ టౌన్‌షిప్ ఖర్ఖోడా తరహాలో పది పారిశ్రామిక నగరాలను నిర్మాణం చేపతామని హామీ ఇచ్చింది. హరియాణాకు చెందిన బలహీన వర్గాలు, ఎస్సీ-ఎస్టీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అంద...