ఐదు నెలల్లో లక్ష ఉద్యోగాలు మాయం : లేఆఫ్.ఫై ట్రాకర్ వెల్లడి

2026 ప్రారంభం నుంచి ఐదు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 1,16,000కు పైగా ఉద్యోగులు జాబ్స్ కోల్పోయినట్లు లేఆఫ్.ఫై ట్రాకర్ వెల్లడించింది. లక్షలాది ఉద్యోగాలు పోవడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందడం అని తెలుస్తోంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కూడా కొన్ని పెద్ద కంపెనీలు ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. మార్చి నెలలో మాత్రమే 46,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. మే నెలలో 28,000 ఉద్యోగాలు తొలగింపులు జరిగాయి. భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా, పేపాల్, సిస్కో, ఇంట్యూట్, క్లౌడ్‌ఫ్లేర్, లింక్డ్ఇన్, ఉబర్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఉబర్ తన పీపుల్ అండ్ ప్లేసెస్ డివిజన్‌లో సుమారు 23 శాతం సిబ్బందిని తగ్గించింది. సిస్కో 4,000 ఉద్యోగాలను తొలగిస్తూ, అదే సమయంలో కృత్రిమ మేధస్సు, సెక్యూరిటీ రంగాల్లో పెట్టుబడులను పెంచుతున్నట్లు ప్రకటించింది. పేపాల్ అయితే రానున్న రోజుల్లో మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు, తన ప్రణాళికను కూడా వెల్లడించింది. మెటా కంపెనీ కూడా తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో భారీ మొత్తంలో తగ్గిస్తూ, ఏఐ ఆధారిత ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేసింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం