సేఫ్టీ విషయంలో మరో మైలురాయిని అందుకున్న మహీంద్రా ఎస్‌యూవీ XUV 7XO
మ హీంద్రా సంస్థకు చెందిన కొత్త 3-రో ఎస్‌యూవీ XUV 7XO సేఫ్టీ విషయంలో మరో అద్భుతమైన మైలురాయిని అందుకుంది. ఇటీవల నిర్వహించిన భారత్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ ఎస్‌యూవీ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ రేటింగ్ ఈ కారు పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లకు కూడా వర్తిస్తుంది. కుటుంబ సభ్యుల రక్షణ కోసం కొనుగోలు చేసే వారికి ఈ కారు మరింత నమ్మకమైన ఎంపికగా నిలుస్తోంది. భారత్ NCAP నిర్వహించిన ఈ క్రాష్ టెస్ట్ సమయంలో XUV 7XO బరువు 2,059 కిలోలుగా ఉంది. టెస్టింగ్ కోసం AX7 డీజిల్ 2WD 7-సీటర్ ఆటోమేటిక్, AX7L డీజిల్ 4WD 7-సీటర్ ఆటోమేటిక్ వేరియంట్లను ఉపయోగించారు. ఈ టెస్ట్‌లో పెద్దల భద్రత విభాగంలో XUV 7XO ఏకంగా 32కి గాను 30.76 మార్కులు సాధించింది. ముఖ్యంగా ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16కి 14.76 మార్కులు, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో ఏకంగా 16కి 16 పూర్తి మార్కులు సాధించడం విశేషం. అలాగే సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లోనూ ఈ కారు అత్యుత్తమ ఫలితాలను రాబట్టింది. కేవలం పెద్దలకే కాకుండా, చిన్న పిల్లల భద్రత విషయంలోనూ ఈ ఎస్‌యూవీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో XUV 7XO మొత్తం...