Posts

Showing posts with the label Boy Witnesses Mother's Extramarital Affair

కన్నతల్లి వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూసిన బాలుడు : కొడుకుని ప్రియుడితో కలిసి చంపిన తల్లి

Image
ఉ త్తరప్రదేశ్‌లో తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన తల్లే తన వివాహేతర సంబంధం కోసం కన్నకొడుకు ప్రాణాలనే బలితీసుకున్న ఈ పైశాచిక చర్య స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. ఘటన జరిగిన రోజున భర్త ఇంట్లో లేని సమయం చూసుకుని సదరు మహిళ తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఆ సమయంలో హఠాత్తుగా ఇంటికి వచ్చిన 14 ఏళ్ల కుమారుడు, తల్లి ప్రియుడితో ఏకాంతంగా ఉండటాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ బాలుడు తల్లి తీరును నిలదీయడమే కాకుండా, పనికి వెళ్లిన నాన్న ఇంటికి రాగానే ఈ నిజాన్ని ఆయనకు చెప్పేస్తానంటూ ఆవేశంతో చెప్పాడు. కొడుకు నిజం బయటపెడితే తమ బాగోతం భర్తతో పాటు ఊరందరికీ తెలిసిపోతుందన్న భయంతో ప్రియుడు కలిసి వెంటనే ఆ 14 ఏళ్ల బాలుడిని పట్టుకుని గొంతునులిమి పాశవికంగా ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా బాలుడి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో విసిరేశారు. బాలుడు కనిపించకుండా పోయాడంటూ వెతుకుతున్న క్రమంలో.. మృతదేహం లభ్యమవడంతో రంగంలోకి దిగిన పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తులో కన్నతల్లి అసలు రంగు బయటపడింది. తల్లితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌క...