Posts

Showing posts with the label DGP CV Anand Reveals

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసు : అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారనే కారణంతో దొంగిలించిన మాజీ జవాన్

Image
సి కింద్రాబాద్ లోని బొల్లారం ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో సంచలనం సృష్టించిన భారీ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు, ఆర్మీ ఇంటెలిజెన్స్ కలిసి విజయవంతంగా ఛేదించాయి. డిసిప్లిన్ కారణాలతో అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారనే తీవ్ర ఆగ్రహం, కక్షతోనే మాజీ జవాన్ మల్లేష్ అలియాస్ రాజు ఈ చోరీకి పాల్పడినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. చోరీకి గురైన ఆయుధాలన్నింటినీ రికవరీ చేశామని, ఈ ఘటనతో దేశ భద్రతకు ఎలాంటి ముప్పులేదని స్పష్టం చేశారు. హెల్త్, ఇన్‌డిసిప్లిన్ కారణాలతో జూన్ 30న మల్లేష్‌ను ఆర్మీ విధుల నుంచి తొలగించారు. దీంతో అకారణంగా తనను తీసేశారనే కోపంతోనే ఆయుధాలను ఎత్తుకెళ్లాడు. ఇందులో ఎలాంటి టెర్రరిస్ట్, డ్రగ్ మాఫియా కోణాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఆయుధాగారం వద్ద రాత్రిపూట సీసీటీవీలు పనిచేయవని తెలిసిన మల్లేష్, జూన్ 28, 29 తేదీల్లో రెక్కీ నిర్వహించాడు. జూన్ 30 రాత్రి కంటోన్మెంట్ పక్కనే ఉన్న బాలాజీ నగర్ నుంచి కార్గిల్ గేట్ ద్వారా లోపలికి ప్రవేశించాడు. గంటసేపు శ్రమించి తాళాలు పగలగొట్టి 7 పిస్తోళ్లు, 13 మ్యాగజైన్లు, 4 ఏకే-203 రైఫిళ్లు, 5.56 ఎంఎం మందుగుండు సామగ్రిని స్కూటీపై బయటకు చేర్చాడు. ఆ సమయంల...