Posts

Showing posts with the label average 778 vehicles were sold every hour

ఏప్రిల్ నెలలో 5.63 లక్షల యూనిట్లను విక్రయించిన హోండా

Image
ఏ ప్రిల్ నెలలో 5.63 లక్షల యూనిట్లను విక్రయించి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రికార్డు సృష్టించింది. ఈ గణాంకాలను విశ్లేషిస్తే సగటున గంటకు 778 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది సుమారు 17 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. దేశీయ రోడ్లపై ప్రతి సెకనుకు ఒక హోండా బండి కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల తొలి ప్రాధాన్యతగా మారిన యాక్టివా స్కూటర్లు, షైన్ బైకులు అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేవలం భారతదేశంలోనే 4.84 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంటే గత ఏడాది కంటే సుమారు 14.7 శాతం ఎక్కువ మంది కస్టమర్లు హోండా నాణ్యతను నమ్మారు. నమ్మకమైన ఇంజిన్, తక్కువ మెయింటెనెన్స్, మంచి రీసేల్ వాల్యూ ఉండటమే దీనికి ప్రధాన కారణం. దేశంలోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా 'మేడ్ ఇన్ ఇండియా' హోండా వాహనాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్న బైకులను విదేశీ కస్టమర్లు ఎగబడి కొంటున్నారు. ఈ ఏడాది ఎగుమతుల్లో ఏకంగా 37 శాతం వృద్ధి సాధించి, 79,600 యూనిట్లకు చేరుకోవడం కంపెనీ గ్లోబల్ డిమాండ్‌కు అద్దం పడుతోంద...