Posts

Showing posts with the label 30 kg of Rotten Mutton and 20 kg of Chicken Seized

కుళ్లిన 30 కేజీల మటన్‌, 20 కేజీల చికెన్‌ స్వాధీనం

Image
హై దరాబాద్‌ నగరంలో టీజీ సేఫ్‌ బృందం​ రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టింది. కూకట్‌పల్లిలో భూలక్ష్మీ మెస్‌లో కుళ్లిన 30 కేజీల మటన్‌, 20 కేజీల చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అత్తాపూర్‌లోని బార్బిక్యూ నేషన్‌ రెస్టారెంట్‌లో హెచ్‌- ఫాస్ట్, ఫుడ్‌సేప్టీ అధికారుల తనిఖీల్లో ఫ్రిజ్‌లో కుళ్లిన మాంసాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. గడువు ముగిసిన ఐస్‌క్రీమ్‌లు, కుళ్లిపోయిన పండ్లను గుర్తించారు. కాగా, ఉప్పల్‌ ‍బ్రాంచ్‌ పిస్తా హౌస్‌ కేక్‌ తిన్న ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. కుళ్లిపోయిన కేక్‌ అమ్మారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేక్‌ తిన్న కాసేపటికే వాంతులు అయ్యాయన్న బాధితులు కేక్ నుంచి దుర్వాసన వచ్చిందని చెబుతున్నారు. ఫుడ్‌ సేఫ్టి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.