అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ
ప్రపంచ అపరకుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. జనవరి 31న దక్షిణ ముంబైలోని టార్డియో ప్రాంతీయ రవాణా కార్యాలయంలో రిలయన్స్ సంస్థ పేరుమీద రిజిస్టర్ అయిన ఆ కారు ధర చూసి ఆర్టీఓ అధికారులు సైతం నోరెళ్లబెట్టారంట. ఇంతవరకు తాము ఇంత ఖరీదైన కారుని రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు లేవని అధికారులు చెప్పుకొచ్చారు. అంతే కాదు.. కారు రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్, ఇతర టాక్స్ ల కోసం.. రిలయన్స్ ప్రతినిధులు ఎంత ఖర్చు చేసిందీ ఆర్టీఓ అధికారులు మీడియాకు వెల్లడించారు. ప్రపంచంలోనే విలాసవంతమైన కారులు తయారు చేసే “రోల్స్ రోయ్స్” సంస్థ తయారు చేసిన “కల్లినాన్” అనే కారును.. ముకేశ్ అంబానీ.. తన అభిరుచికి తగ్గట్టుగా ప్రత్యేకంగా తయారు చేయించారట. కారు అసలు ధర భారత్ లో దాదాపు రూ. 6.95 కోట్లు కాగా..అంబానీ తనకు తగ్గట్లుగా మార్పులు చేయించుకోవడంతో ఆ ధర రెట్టింపై రూ.13.14 కోట్లకు చేరింది. ఈ కారును విదేశాల నుంచి ఆర్డర్ పై ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కారు రోడ్డు ట్యాక్సే ఏకంగా రూ.20 లక్షలు ఉంది. అదనంగా రోడ్ సేఫ్టీ టాక్స్ మరో రూ.40 వేలు కూడా రిలయన్స్ ప్రతినిధులు చెలించినట్లు ఆర్టీఓ అధికా...