మైక్రోసాఫ్ట్ తో కలిసి AI voice ఫీచర్ ని తీసుకు వచ్చిన Truecaller ?
మై క్రోసాఫ్ట్ కొత్త వ్యక్తిగత వాయిస్ Ai సహాయం మరియు టెక్నాలజీని ఇష్టపడి ట్రూకాలర్ దానిని తన యాప్ కోసం తీసుకురావడానికి ఎదురుచూస్తోంది. ఈ సహకారం Azure AI ప్రసంగం సహాయంతో చేయబడుతుంది. ట్రూ కాలర్ యాప్ ప్రీమియమ్ సభ్యత్వం పొందిన వినియోగదారుల కోసం మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఉన్న Truecaller AI అసిస్టెంట్‌ని కంపెనీ 2022 లో పరిచయం చేసింది. ఈ టెక్నాలజీ కాల్‌లకు సమాధానం ఇవ్వడం, వాటిని స్క్రీనింగ్ చేయడం, మెసెజ్ లు తీసుకోవడం లేదా తర్వాత సమీక్ష కోసం కాల్‌లను రికార్డ్ చేయడం వంటి అనేక పనులను ఇప్పటికే చేయగలదు. అయితే ఈ ఫీచర్ ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. AI రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో, ఈ ఫీచర్లు సరిపోవు. అందుకే, ట్రూ కాలర్ దీన్ని అప్‌గ్రేడ్ చేయాలని చూస్తోంది. మైక్రోసాఫ్ట్‌తో కలిసి పని చేయడం ద్వారా, ట్రూకాలర్ ఇప్పుడు వినియోగదారులకు తమ వాయిస్ కు డిజిటల్ ప్రతిరూపాన్ని అందించగలదు. మెరుగుపరచబడిన AI అసిస్టెంట్ ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ ఫీచర్ గతంలో ఉపయోగించిన జెనరిక్ డిజిటల్ అసిస్టెన్స్ వాయిస్ లాగా కాకుండా యూజర్ వాయిస్ యొక్క ప్రామాణికమైన వెర్షన్‌ను...