నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం
ని జామాబాద్ మేయర్ పీఠం హస్తగతం అయింది. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అధికారికంగా ప్రకటన రావడమే మిగిలింది. కాంగ్రెస్ – బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో చివరికి అధికార కాంగ్రెస్ పై చేయి సాధించింది. ఆ పార్టీ నుండి మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఇపుడు కీలంగా మారింది. మరోసారి మేయర్ పీఠం బీజేపీ చేజారింది. రేపు మేయర్ ఎన్నిక అధికారికంగా జరగనున్న నేపధ్యంలో రెండూ పార్టీల బాలా బలాల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్ లు ఉండగా బీజేపీ 28 స్థానాల్లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీకి మరో మూడు ఎక్స్ అఫిషియో స్థానాలు ఉన్నాయి. నిజామాబాద్ ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెలే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెలే పైడి రాకేష్ రెడ్డి ఓట్లతో కలిపి బీజేపీ సంఖ్య 31కి చేరింది. కానీ బీజేపీ కంటే రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ సంఖ్యను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ స్వతహాగా గెలిచిన స్థానాలు 17 కాగా, ఎంఐఎం గెలిచిన 14 స్థానాలు తన ఖాతాలో కలుపుకుంది. బీఆర్ఎస్ నుండి గెలిచిన ఏకైక ...