Posts

Showing posts with the label Drone Attack on Fujairah Oil Industry Zone in UAE

యూఏఈలోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై డ్రోన్ దాడి : ముగ్గురు భారతీయ కార్మికులకు గాయాలు : భారత విదేశాంగ శాఖ హెచ్చరిక

Image
యు నైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని సోమవారం ఫుజైరా చమురు పరిశ్రమ ప్రాంతంపై జరిగిన డ్రోన్ దాడిలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానిక అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, బాధితులకు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తోంది. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ మొత్తం నాలుగు క్షిపణులను ప్రయోగించింది. వీటిలో మూడింటిని యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకోగా, ఒకటి సముద్రంలో పడిపోయింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలు వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్నే పాటించాలని అధికారులు సూచించారు. పౌర మౌలిక సదుపాయాలను, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత విచారకరమని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనాలంటే సంక్షోభాలను కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ పునరుద్ఘాటించింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నిరాటంకంగా నౌకాయానం సాగాలని, సముద్ర భద్రత విష...