Posts

Showing posts with the label Discrepancies in Asset Valuation in Nomination Papers Submitted by Vijay

విజయ్‌ సమర్పించిన నామినేషన్ పత్రాలలో ఆస్తి విలువలో తేడాలు : నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు

Image
కో లీవుడ్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు మద్రాస్ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తన ఆస్తి విలువను వేర్వేరుగా చూపించారు. దీనిపై చెన్నైకు చెందిన వి.విగ్నేష్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ ఎన్నికల్లో చెన్నై పెరంబూరు, తిరుచి సెంట్రల్ నియోజకవర్గాలో విజయ్ పోటీ చేస్తున్నారని, ఇందుకోసం ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌‍లలో ఆస్తి విలువలో తేడాలు ఉన్నాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పెరంబూర్‌లో సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తుల వివరాలు రూ.115 కోట్లుగా ఉండగా, తిరుచ్చిలో రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఇచ్చిన వివరాల్లో వెల్లడించిన ఆస్తులు విలువ రూ.220కోట్లుగా ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఇలా ఎందుకు తేడా చూపించాల్సి వచ్చించిందో వివరించేలా ఎలాంటి అనుబంధ పత్రాలు విజయ్ ఇవ్వలేదన్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు విజయ్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అలాగే ఎన్నికల సంఘం, ఆదాయపన్ను శాఖల వివరణ కూడా తీసుకోవాలని ఆదేశించింది.