Posts

Showing posts with the label Android 16

మే నెలలో వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ విడుదల : 7000mAh బ్యాటరీతో సంచలనం

Image
దే శీయ మార్కెట్లోకి మే నెలలో రాబోతున్న 'వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్'కు సంబంధించిన వివరాలు గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో పాటు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 సాఫ్ట్‌వేర్‌ను అందించనున్నారు. లీకైన వివరాల  ఇందులో 8GB ర్యామ్ ఉండబోతోంది. దీనివల్ల యాప్స్ వాడటంలో గానీ, గేమింగ్ ఆడేటప్పుడు గానీ ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఇక ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తుండటంతో, యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లను ఎంజాయ్ చేయవచ్చు. సాధారణంగా ప్రీమియం ఫోన్లలో మాత్రమే కనిపించే ఫీచర్లను వన్‌ప్లస్ ఈ బడ్జెట్ ఫోన్ ద్వారా అందిస్తోంది. దీనిలో 7,000mAh భారీ బ్యాటరీని ఇస్తున్నట్లు సమాచారం. ఇంత పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల కంటే ఎక్కువ కాలం వస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి, ఫోన్‌ను విపరీతంగా వాడే హెవీ యూజర్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) లిస్టింగ్‌లో ఈ ఫోన్ కనిపించడంతో లాంచ్ డేట్ చాలా దగ్గరలోనే ఉందని స్పష్టమవుతోంది. ధర విషయంలో కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయన...

త్వరలో వివో వై 500ఐ విడుదల

Image
వివో ఇప్పటికే వై 500 ప్రో ద్వారా భారీ బ్యాటరీ ఫోన్ ఇచ్చిన ఇప్పుడు అదే సిరీస్ లో వివో వై 500ఐ ను తీసుకురావడానికి సిద్ధమైంది. అధికారిక లాంచ్ కి ముందే చైనా టెలికాం డేటాబేస్ లో ఈ ఫోన్ వివరాలు కనిపించడంతో స్పెసిఫికేషన్స్ అన్నీ దాదాపుగా బయటకు వచ్చాయి. ముఖ్యంగా 7200mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ లాంటి అంశాలు ఈ ఫోన్‌ను డైలీ యూజ్ కోసం బలమైన ఎంపికగా చూపిస్తున్నాయి. వివో వై 500ఐ డిజైన్ మొదట చూసిన వెంటనే ఒక ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఈ ఫోన్ డిజైన్ చాలా వరకు వివో ఎస్50 ను గుర్తు చేస్తుంది. బ్యాక్ ప్యానల్ మీద క్లిన్ ఫినిష్ ఉండటం వల్ల ఫింగర్ ప్రింట్స్ ఎక్కువగా పడే అవకాశం తక్కువగా ఉంటుంది. కెమెరా మాడ్యూల్ ఎక్కువగా బయటకు రావకుండా ఫ్లాట్ డిజైన్ లో ఉండటం వల్ల ఫోన్ టేబుల్ మీద పెట్టినప్పుడు స్టేబుల్ గా ఉంటుంది. ఈ ఫోన్ సైజ్ 166.64mm పొడవు, 78.43mm వెడల్పు, 8.39mm మందంతో ఉంది. బరువు 219గ్రాములు కావడంతో పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా రోజువారీ వాడకంలో ఎక్కువగా ఇబ్బంది అనిపించదు. సైడ్ లో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్పందన కూడా ఫాస్ట్ గా ఉంటుందని అంచనా. వివో వై 500ఐ లో 6.75అంగుళాల పెద్ద డిస్‌ప్లే ...