మే నెలలో వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ విడుదల : 7000mAh బ్యాటరీతో సంచలనం

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లోకి మే నెలలో రాబోతున్న 'వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్'కు సంబంధించిన వివరాలు గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో పాటు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 సాఫ్ట్‌వేర్‌ను అందించనున్నారు. లీకైన వివరాల  ఇందులో 8GB ర్యామ్ ఉండబోతోంది. దీనివల్ల యాప్స్ వాడటంలో గానీ, గేమింగ్ ఆడేటప్పుడు గానీ ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఇక ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తుండటంతో, యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లను ఎంజాయ్ చేయవచ్చు. సాధారణంగా ప్రీమియం ఫోన్లలో మాత్రమే కనిపించే ఫీచర్లను వన్‌ప్లస్ ఈ బడ్జెట్ ఫోన్ ద్వారా అందిస్తోంది. దీనిలో 7,000mAh భారీ బ్యాటరీని ఇస్తున్నట్లు సమాచారం. ఇంత పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల కంటే ఎక్కువ కాలం వస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి, ఫోన్‌ను విపరీతంగా వాడే హెవీ యూజర్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) లిస్టింగ్‌లో ఈ ఫోన్ కనిపించడంతో లాంచ్ డేట్ చాలా దగ్గరలోనే ఉందని స్పష్టమవుతోంది. ధర విషయంలో కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, మార్కెట్లో పోటీని తట్టుకునేలా చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్లను అందించి మార్కెట్‌ను కైవసం చేసుకోవాలని వన్‌ప్లస్ ప్లాన్ చేస్తోంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default