Posts

Showing posts with the label Andesri

అందెశ్రీ కన్నుమూత

Image
ప్ర ముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీని వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆస్పత్రిలో చేర్చారు ఆయన కుమారులు. అక్కడ చికిత్సపొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు, ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య.అందెశ్రీ బాల్యం ఎంతో కష్టంగా సాగింది. ఈయన ఒక అనాథగా పెరిగారు. ఆయన తన తల్లిదండ్రులు ఎవరో, తన సొంత ఊరు ఎక్కడో తెలియదు. జీవనం కోసం కొన్నాళ్లు గొర్రెల కాపరిగా పనిచేశారు. అక్కడి నుంచే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించారు. ఏ విధమైన చదువు చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తన స్వీయ కృషి, పట్టుదలతో తెలుగు సాహిత్యంపై పట్టు సాధించారు. కవిత్వంలో అందెశ్రీ కృషికి గాను పలు విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేశాయి. అందెశ్రీ గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి పాట తెలంగాణ పల్లెల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన తాగుబోతు పాట ('మాయమైపోతున్నడమ్మ... మనిషన్నవాడు'). ఆయన మొదటిసారి స్టేజిపై పాడింది కూడా ఈ పాటనే. అందెశ్రీ తన కవిత్వం, పాటలు ఆలపించేటప్పుడు ఒక ప్రత్యేకమైన మ్యానరిజం ఉంటుంది ప్రదర్శిస్తారు. కళ్ళు మూసుకుని, త...