రెడ్ మీ నోట్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు రేపటి నుండి సేల్ !
రెడ్ మీ నోట్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు రేపటి నుండి అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ నుండి Redmi Note 12 5G, 12 Pro 5G మరియు 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది మరియు ఈ మూడు ఫోన్లు కూడా రేపటి నుండి సేల్ అవనున్నాయి. వీటిలో, 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 200MP భారీ కెమేరా మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. రెడ్ మీ నోట్ 12 ప్రో+ 5G స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో రూ.29,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో ధర రూ.32,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ జనవరి 11 నుండి అమెజాన్ మరియు mi స్టోర్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ పైన గొప్ప లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMI మరియు డెబిట్ కార్డ్ EMI తో కొనేవారికి 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. Redmi Note 12 Pro+ 5G ఫోన్ 6.5-ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే Dolby Vision సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫ...