Posts

Showing posts with the label Bill Gates to attend

ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు : బిల్‌గేట్స్‌ హాజరుకానున్నట్లు గేట్స్‌ ఫౌండేషన్‌ అధికార ప్రతినిధులు వెల్లడి

Image
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఢిల్లీలో 'భారత్‌ మండపం'లో ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తుంది. అయితే ఈ సమ్మిట్‌ అధికారిక వెబ్‌సైట్‌ అతిథుల లిస్టులో బిల్‌గేట్స్‌ పేరు లేదు. కేంద్రం సైతం ఆయన్ను ఆహ్వానించే విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అందుకు దుమారం రేపుతున్న ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో బిల్‌గేట్స్‌ పేరు ఉండడమే కారణమని తేలింది. దీంతో సమ్మిట్ వెబ్‌సైట్‌లో గేట్స్ పేరు లేకపోవడం వల్ల ఆయనకు ఆహ్వానం రద్దయిందంటూ పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్‌ మీడియాలో సైతం వార్తలు చక్కెర్లు కొట్టాయి. ఈ క్రమంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో 'బిల్ గేట్స్‌ ఫిబ్రవరి 19న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొని తన ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు' అని వెల్లడించారు.