Posts

Showing posts with the label Afghanistan

ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక పక్క మంచు తుఫాన్ - మరో పక్క భారీ వర్షాలు

Image
ఆ ఫ్ఘనిస్తాన్‌లో ఒక పక్క మంచు తుఫాన్, మరో పక్క భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా మూడు రోజుల వ్యవధిలోనే 61 మందికిపైగా మరణించారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఏఎన్డీఎమ్ఏ) శనివారం వెల్లడించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం గత మూడు రోజులలో సెంట్రల్, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లో మంచు తుఫాన్, భారీ వర్షాలు విలయం సృష్టించాయి. వరదలు, మంచు చరియలు విరిగిపడటం, ఇండ్లు కూలిపోవడం వంటి ఘటనల వల్ల దాదాపు 61 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. 110 మందికిపైగా గాయపడ్డారు. 458 వరకు ఇండ్లు ధ్వంసమయ్యాయి. 360కిపైగా కుటుంబాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. అలాగే అనేక చోట్ల రోడ్లు పాడైపోయాయి. మరోవైపు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు పడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మంచు కురిసే ప్రాంతాల్లో ప్రజలు ఇండ్లనుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు. రోడ్లు కొట్టుకుపోవడం వల్ల చాలా ప్రాంతాలకు రవాణా నిలిచిపోయింది. అనేక ప్రాంతాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. ఈ దేశానికి వ...

కాబూల్‌లో భారీ బాంబు పేలుడు : ఏడుగురు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు!

Image
ఆ ఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సుమారు ఏడుగురు మరణించగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పెద్ద పెద్ద కార్యాలయ భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, రాయబార కార్యాలయాలు ఉన్న వాణిజ్య షహర్-ఎ-నావ్ పరిసరాల్లోని ఒక హోటల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. షహర్-ఎ-నవ్ కాబూల్‌లోని అత్యంత సురక్షితమైన ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తారు. గాయపడిన వారు కాబూల్‌లోని సర్జికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని ఆఫ్ఘన్ రాజధానిలో ఆసుపత్రిని నిర్వహిస్తున్న ఇటాలియన్ ఎన్జీఓ ఎమర్జెన్సీ తెలిపింది. అయితే ఈ పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటించలేదు. ఈ సంఘటన కారణంగా ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే దర్యాప్తును కూడా ప్రారంభించారు. అయితే, పేలుడు ఉగ్రవాద దాడా లేదా ఏదైనా సాంకేతిక కారణం వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కాబూల్‌లోని షహర్-ఎ-నౌ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌లో సోమవారం పేలుడు సంభవించిందని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఈ పేలుడులో చాలా మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్...