హైసెన్స్ ఏ10 ప్రో, హైసెన్స్ ఏ10 అల్ట్రా స్మార్ట్ ఫోన్ల విడుదల
చైనా మార్కెట్‌లో హైసెన్స్ ఏ10 ప్రో, హైసెన్స్ ఏ10 అల్ట్రా పేర్లతో రెండు ప్రత్యేకమైన ఈ-ఇంక్ స్మార్ట్‌ఫోన్లను సంస్థ అధికారికంగా విడుదల చేసింది. సాధారణ డిజిటల్ స్క్రీన్ల వల్ల కళ్లకు కలిగే శ్రమను తగ్గించేలా పేపర్‌లాంటి రీడింగ్ అనుభూతిని అందించడంతో పాటు, అవసరమైనప్పుడు రంగుల ప్రపంచాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేకమైన డిటాచబుల్ కలర్ స్క్రీన్‌ను అమర్చుకునే వినూత్న సాంకేతికతను ఈ సిరీస్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. హైసెన్స్ A10 సిరీస్‌లో 6.13 అంగుళాల Carta 1300 e-ink డిస్‌ప్లేను అమర్చారు. ఇది 1648×824 పిక్సెల్స్ రిజల్యూషన్ , 300 ppi పిక్సెల్ డెన్సిటీతో స్పష్టమైన విజువల్స్ ఇస్తుంది. 256 గ్రేస్కేల్ లెవల్స్, 36 డ్యూయల్-కలర్ ఫ్రంట్ లైటింగ్ సపోర్ట్‌తో వచ్చే ఈ స్క్రీన్ సాధారణ స్మార్ట్‌ఫోన్లలా కాకుండా సరిగ్గా పుస్తకం చదువుతున్న అనుభూతినే అందిస్తుంది. ఇందులో బ్లూ లైట్, స్క్రీన్ ఫ్లికర్ వంటి సమస్యలు ఏమాత్రం ఉండవు. దాంతో నిరంతరం ఈ-బుక్స్ చదివేవారు, పిడిఎఫ్ ఫైళ్లు పరిశీలించే విద్యార్థులు, డిజిటల్ నోట్స్ రాసుకునే వారికి ఇది ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌ను సమర్థవంతంగా ...