Ad Code

హర్యానాలో ఆకర్షణీయ పథకాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల !


ర్యానాలో కాంగ్రెస్ కు కౌంటర్ గా బీజేపీ తమ మేనిఫెస్టోలో ఆకర్షణీయ పథకాలను ప్రకటించింది. లడో లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని హామీ ఇచ్చింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, హర్‌ ఘర్‌ గృహిణి యోజన కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. హర్యానాకు చెందిన ప్రతీ అగ్నివీర్‌కు కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొంది. సంకల్ప పత్ర పేరిట రోహ్‌తక్‌లో ఈ మేనిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. హర్యానాకు చెందిన బలహీన వర్గాలు, ఎస్సీ-ఎస్టీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు దేశంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడ ఇంజనీరింగ్‌ లేదా వైద్య విద్య అభ్యసించినా వారికి స్కాలర్‌షిప్స్‌ అందిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అదే విధంగా 24 పంటలకు కనీస మద్దతు ధర కల్పనకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్లు నిర్మాణం..ఇండస్ట్రియల్ మోడల్ టౌన్‌షిప్ ఖర్ఖోడా తరహాలో పది పారిశ్రామిక నగరాలను నిర్మాణం చేపతామని హామీ ఇచ్చింది. హరియాణాకు చెందిన బలహీన వర్గాలు, ఎస్సీ-ఎస్టీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందిస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీలతో ఏ స్థాయిలో ఓట్లు దక్కుతాయనేది చూడాలి.

Post a Comment

0 Comments

Close Menu