డిసెంబర్ చివరి రోజుల్లో వర్షాలు, పొగమంచు, చలిగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో వెచ్చగా ఉండాలంటే రూమ్ హీటర్‌ను పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో సహా ఆఫ్‌లైన్ మార్కెట్‌లో కూడా అనేక రూమ్ హీటర్లు అందుబాటులో ఉన్నాయి.
జిగ్మా రూమ్ హీటర్ : Zigma Z-1136 Next Gen పేరుతో రూం హీటర్ కేవలం రూ.923కే అందుబాటులో ఉంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. భద్రత దృష్ట్యా, థర్మల్ కట్ ఆఫ్ ఎంపికను ఇందులో చేర్చారు. ఇది రెండు ఎంపికలను కలిగి ఉంటుంది. ఒకటి 1000 వాట్స్, మరొకటి 2000 వాట్స్ ఇది ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ను కూడా కలిగి ఉంటుంది.
Maxotec గది హీటర్ : Maxotech Rigal PLus పేరుతో ఈ హీటర్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.1000 కంటే తక్కువ. ఇందులో నాన్-సౌండ్ కాపర్ మోటార్ ఉపయోగించారు. దీంతో పాటు వేగం, వేడిని నియంత్రించడానికి రెండు ఎంపికలు ఇచ్చారు.
లైఫ్ లాంగ్ గది హీటర్ : లైఫ్‌లాంగ్ LLQH01 Inferno 800W హీటర్ ISI సర్టిఫికేట్ పొందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది. దీన్ని ఆపరేట్ చేయడం చాలా సులభం. దీని ధర రూ.899. ఇది 800W శక్తిని వినియోగిస్తుంది. 1.4 కిలోల బరువు ఉంటుంది. వేడి కోసం ఇది రెండు గొట్టాలను కలిగి ఉంటుంది.
orpat రూమ్ హీటర్ : ఆర్పాట్ రూమ్ హీటర్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ నుంచి కేవలం రూ.1,074కి కొనుగోలు చేయవచ్చు. వైట్ కలర్ లో వస్తున్న ఈ రూమ్ హీటర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది వేడి కోసం రెండు సెట్టింగులను కలిగి ఉంది. ముందు భాగంలో సేఫ్టీ గ్రిల్ ఇచ్చారు. మీరు దీన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, దానిపైన చల్లగానే ఉంటుంది. ఇది భద్రత పరంగా మంచి ఫీచర్ అని చెప్పవచ్చు.
0 Comments