కర్ణాటకలోని పలు పెట్రోల్ బంకుల్లో విక్రయిస్తున్న పెట్రోల్లో 20 శాతం కంటే ఎక్కువగా ఇథనాల్ ఉన్నట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ20 కార్యక్రమం కాస్తా 420గా మారిందంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇది ప్రజల కార్ల నుంచి పెట్రోల్ దొంగలించడమేనని మండిపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ చమురు కంపెనీలు నిర్దేశించిన బ్లెండింగ్ పరిమితిని మించి ఇంధనాన్ని విక్రయిస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు కర్ణాటకలోని పలు జిల్లాల నుంచి సేకరించిన ఇంధన నమూనాల ప్రయోగశాల పరీక్షలను ఆయన ఉటంకించారు. బెంగళూరు, కోలారు, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణం, రామనగర, మంగళూరు, తుమకూరుతో సహా పలు ప్రాంతాల నుంచి ఈ నమూనాలను సేకరించినట్లు రాహుల్ వెల్లడించారు. వీటిల్లో ఇథనాల్ గాఢతలు 31.2 శాతం, 30.5 శాతంగా నమోదయ్యాయని తెలిపారు. గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షించిన మొత్తం 14 నమూనాలలోని 11 నమూనాల్లో 20 శాతానికి పైగా ఇథనాల్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఇంధన ట్యాంకులలో ఏమి నింపుతున్నారనే విషయాన్ని ఇప్పటికైనా తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 20శాతం కంటే ఎక్కువ ఇథనాల్ కలుపుతున్న కంపెనీలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఇటువంటి విధానాల వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత నిలదీశారు. కర్ణాటకలో ఈ-20 పేరిట 30 శాతం ఇథనాల్ కలిసిన ఇంధనాన్ని విక్రయిస్తున్నారని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ శుక్రవారం ఆరోపించారు. దీంతో ఈ విషయంపై రాజకీయ దుమారం రేగింది. అయితే పెట్రోల్లో ఇథనాల్ పరిమాణం ఎక్కువగా ఉందని కర్ణాటక ప్రభుత్వం వాదించడాన్ని కేంద్ర పెట్రోలియం సంస్థలు, ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంయుక్తంగా తోసిపుచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ పరీక్ష ప్రామాణికత సరికాదని తేల్చిచెప్పాయి. కేంద్ర ప్రభుత్వ ప్రమాణాల సంస్థ నిబంధనల మేరకు ఇథనాల్ 19- 21శాతం మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించాయి.
3
Beranda › Posts filed under 'E20' program turns into '420'
Showing posts with label 'E20' program turns into '420'. Show all posts
Showing posts with label 'E20' program turns into '420'. Show all posts
Subscribe to:
Posts (Atom)
