విదేశీ సాయం వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు : ధైర్యం ఉంటే చర్చకు రావాలని మోడీకి సవాల్ విసిరిన రాహుల్ గాంధీ

ఎక్స్ వేదికగా ప్రధాని మోడీని ఉద్దేశించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ప్రజలతో అబద్ధాలు చెప్పడం ఆపాలని మోడీకి సూచించారు. విదేశీ సాయం వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని, వారి మద్దతుతో ఇప్పటికీ పదవిలో కొనసాగుతున్నారని సంచలన ఆరోపించారు. ఈ మేరకు  మీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విదేశీయుల నియంత్రణలో ఉందని, విదేశీయుల మద్దతుతోనే నడుస్తోందన్నా. విదేశీ సోషల్ మీడియా కూడా పూర్తిగా మీకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ అంశాలపై తనతో బహిరంగ చర్చకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాహుల్ చాలెంజ్ చేశారు. ఏ వేదికపైనైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మోడీకి ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. అయితే తనకు తెలిసిన విషయాల గురించి ప్రధాని భయపడుతున్నారని అందుకే బహిరంగ చర్చకు ముందుకు రారని రాహుల్ గాంధీ విమర్శించారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 151వ జయంతి పురస్కరించుకుని గుజరాత్ లోని ఏక్తానగర్ లో శనివారం నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని రాహుల్ గాంధీపై పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశారు. విదేశాల్లో రహస్యంగా కొందరిని కలుస్తున్నది ఎవరు? భారత్ ను వ్యతిరేకిస్తున్న శక్తుల మద్దతు అందుకుంటున్న వ్యక్తి ఎవరు? మన శత్రుల భాషలో మాట్లాడుతోంది ఎవరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విడగొట్టేందుకు ఆటంకకర శక్తులు కుట్ర.. వదంతులు వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఈ దేశాన్ని విభజించేందుకు కొన్ని శక్తులు నిరంతరం కుట్రలు పన్నుతున్నాయి. దశాబ్దానికి పైగా నిరాశ, నిస్పృహల తర్వాత ఈ శక్తులు ఇప్పుడు నేరుగా బహిరంగంగా బయటకు వచ్చాయి. విదేశాల్లో రహస్యంగా ఎవరు ఎవరిని కలుస్తున్నారు? భారత్ వ్యతిరేక శక్తులు ఎవరికి మద్దతు ఇస్తున్నాయి? భారత శత్రువుల భాషలో ఎవరు మాట్లాడుతున్నారు? వీటన్నింటినిగుర్తించి ఐక్యంగా వాటిని ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై సోమవారం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పదింస్తూ మీరే విదేశీయుల మద్దతుతో నడుస్తున్నారని కౌంటర్ ఆరోపణలు చేశారు.

Post a Comment

Previous Post Next Post
3