తెలంగాణాలో మురసు తుపాను ప్రభావంతో భారీగా వరద నీరు చేరి దెబ్బతిన్న ప్రాంతాల్లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం పర్యటించారు. సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లో తెగిన చెరువు కట్టలు, నీట మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్లు దివాకర టీఎస్, అంకిత్‌లతో కలిసి బేతుపల్లి పెద్ద చెరువు ముంపు ప్రాంతంలోని పంట పొలాలను మంత్రి పరిశీలించారు. వరద తీవ్రత, పంటలకు జరిగిన నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దమ్మపేట మండలం నాగుపల్లి వద్ద మల్లెపూల వాగు ఉప్పొంగడంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ముసలి బంధం చెరువు కట్టకు ఐదు చోట్ల గండ్లు పడిన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండుగులపల్లి వద్ద వాగు పరిసరాల్లో దెబ్బతిన్న కట్టను, దమ్మపేటలో తెగిపోయిన పేరంటాల చెరువు కట్టను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వరద ఉద్ధృతి, సహాయక చర్యలు, చేపట్టాల్సిన మరమ్మతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సత్తుపల్లిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రాంతంలోకి వరద నీరు చేరిన ప్రాంతాన్ని సందర్శించి స్థానిక పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దెబ్బతిన్న చెరువు కట్టలకు తక్షణమే మరమ్మతులు చేపడతామని, పంట నష్టంపై వివరాలు సేకరించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
3
Beranda
› " stated Minister Ponguleti Srinivasa Reddy during his visit to cyclone-affected areas
› "We will collect details on crop losses and take measures to ensure farmers do not face hardships
› telangana
› పంట నష్టంపై వివరాలు సేకరించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పొంగులేటి
Subscribe to:
Post Comments (Atom)
