టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ అబుదాబిలో గడిపిన వీకెండ్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పగలు లూవ్రే, రాత్రి యూఎఫ్‌సీ. మధ్యలో ఎక్కడో ఓ మంచి భోజనం ఆ తర్వాత మరోసారి భోజనం. అబుదాబిలో నా వీకెండ్ అంటే ఇలాగే ఉంటుంది అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోల్లో ఆయన కళాఖండాలను ఆస్వాదిస్తూ మంచి ఆహారం తింటూ, విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. మరో ఫొటోలో నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా, క్రికెటర్ శిఖర్ ధావన్‌తో కలిసి విజయ్ ఉన్నారు. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న వారికి విజయ్ అంతకుముందు గట్టిగా బదులిచ్చారు. రష్మికతో కలిసి ఉన్న ఫొటో, వీడియోను షేర్ చేస్తూ నా బెస్ట్ ఫ్రెండ్, నా భార్య, నా జీవిత భాగస్వామి. నా జీవితంలో నేను సరైన నిర్ణయం తీసుకున్న అత్యంత అందమైన విషయాల్లో ఆమె ఒకరు. మా గురించి ఆందోళన చెందుతున్నవారికి ఒక్కటే చెబుతున్నా మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. నేను అదృష్టవంతుడిని అని రాశారు. ప్రపంచమంతా మాకు ఎదురైనా నేను, ఆమె కలిసి ఉంటే చాలు. ప్రేమను, సంతోషంగా జీవించడంలోని సరళతను గౌరవించే వారందరికీ ఎంతో ప్రేమ అని పేర్కొన్నారు. తమ బంధాన్ని విమర్శించడం కొనసాగిస్తున్నవారిని ఉద్దేశించి ఇప్పుడు ఎలాంటి దయ లేదా గౌరవం చూపించాలనే ఉద్దేశం లేకుండా చెబుతున్నా.. మిగతా వారంతా తమ పని తాము చూసుకోవచ్చు అంటూ ఘాటుగా స్పందించారు.
నా బెస్ట్ ఫ్రెండ్, నా భార్య, నా జీవిత భాగస్వామి రష్మిక : అబుదాబిలో గడిపిన వీకెండ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన విజయ్ దేవరకొండ
byTelugu Lo Computer
•
•
2 min read
