బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 28లోగా భారత్‌ను విడిచి వెళ్లాలని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. అయితే ఈ ఉపశమనం ప్రస్తుతానికి తాత్కాలికమే. కేసు విచారణను నవంబర్ 2కు వాయిదా వేయడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. అమెరికా పౌరుడైన ఇమ్రాన్ ఖాన్‌కు రెండేళ్ల వయసు నుంచే భారత్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్న నేపథ్యంలో FRRO నుంచి భారత్‌ను విడిచి వెళ్లాలంటూ నోటీసులు అందాయి. ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే నిరసన నిర్వహించిన నిర్వాహకులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇమ్రాన్ ఖాన్ తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. నిరసనలో పాల్గొన్న నేపథ్యంలోనే తనకు ఈ నోటీసులు జారీ అయ్యాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ హాజరు కాలేకపోవడంతో బాంబే హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది. ఇదే సమయంలో మధ్యంతర ఉపశమనం కొనసాగుతున్నంత వరకు ఇమ్రాన్ ఖాన్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని అదనపు సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్‌కు లభించిన ఊరట తాత్కాలికమే కావడంతో నవంబర్ 2న జరిగే విచారణ కీలకంగా మారనుంది. FRRO జారీ చేసిన ఆదేశాలపై న్యాయస్థానం తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అప్పటివరకు ఆయనపై బలవంతపు చర్యలు ఉండవని ప్రభుత్వ తరఫు న్యాయవాది హామీ ఇవ్వడం ప్రస్తుతానికి ఊరటనిచ్చే అంశం.