చైనా మార్కెట్లో వన్‌ప్లస్ టర్బో 6వీఎస్ విడుదల

చైనా మార్కెట్లో తన వన్‌ప్లస్ కొత్త ఫోన్ వన్‌ప్లస్ టర్బో 6వీఎస్ ను విడుదల చేసింది. ఈ ఏడాది లాంచ్ అయిన వన్‌ప్లస్ టర్బో 6వీకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా దీనిని తీసుకొచ్చింది. భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను రూపొందించింది. ఇందులో 50MP ప్రధాన కెమెరాతో పాటు 16MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ మొబైల్ లో 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. 800 నిట్స్ సాధారణ బ్రైట్‌నెస్‌తో పాటు గరిష్ఠంగా 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఫోన్ దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌ను కలిగి ఉంది.  ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనితో 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్ అందించారు. ఆండ్రాయిడ్ ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇతర ఫీచర్లలో స్టీరియో స్పీకర్లు, X-యాక్సిస్ మోటార్, IR బ్లాస్టర్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 5G, NFC, USB Type-C పోర్ట్‌ను అందించారు. కెమెరా విభాగంలో వెనుకవైపు OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో 9,000mAh భారీ బ్యాటరీని అందించడం మరో ప్రత్యేకత. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో ఇతర పరికరాలకు కూడా ఫోన్ ద్వారా ఛార్జింగ్ అందించవచ్చు. చైనాలో OnePlus Turbo 6Vs 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.52,851గా ఉంటుంది. ఆరెంజ్, నోవా వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను పొందవచ్చు. ప్రస్తుతం వన్‌ప్లస్ చైనా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ లిస్ట్ అయింది. అయితే ప్రస్తుతానికి స్టాక్ అందుబాటులో లేదని వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది.

Post a Comment

Previous Post Next Post
3