3

వీబీజీ రామ్‌జీ ఉపాధి హామీ పథకం : తెలంగాణలో ఒకే రోజు 5 లక్షల మందికి పనులు కల్పన

వీబీజీ రామ్‌జీ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ సరికొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 3న ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5 లక్షలకు పైగా కూలీలకు పనులు కల్పించి ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. సాధారణంగా నవంబర్ మాసంలో ఇంత పెద్ద మొత్తంలో ఉపాధి కల్పించడం ఈ పథకం చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ రికార్డు స్థాయి పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో గ్రామీణ పేదలకు మరిన్ని పనిదినాలు కల్పించేలా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీబీజీ రామ్‌జీ ఉపాధి పనుల నిర్వహణపై మంత్రి సీతక్క అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు నిరంతరం పని లభించేలా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలి. వర్షపు నీటిని ఒడిసిపట్టే పనులు, చెరువులు, కుంటలు తదితర నీటి వనరుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం కూలీ కల్పించడమే కాకుండా.. ఉపాధి, జల సంరక్షణ, గ్రామాల్లో శాశ్వత ఆస్తుల కల్పన అనే మూడు అంశాలే ప్రధాన లక్ష్యాలుగా పనులు సాగాలి. ప్రతి గ్రామంలో స్థానిక అవసరాలను గుర్తించి, పనులు నిరంతరం కొనసాగేలా చూస్తూ గ్రామీణ పేద కుటుంబాలకు గట్టి ఆర్థిక భరోసా కల్పించాలి.

Related Post

Previous
Next Post »