అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ పార్టీ ఓటమి పాలు కావటం అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు భారీ ఊరటను అందించింది. ఇదే క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా 5 శాతం మేర పతనం అయ్యాయి. ట్రంప్ ఓటమితో పాజిటివ్ ట్రెండ్ తో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్స్ దూకుడుతో సూపర్ ర్యాలీని నమోదు చేశాయి. గురువారం స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయ్యే నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2008 పాయింట్లు లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 576 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 1860 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1115 పాయింట్ల లాభాలతో క్లోజ్ అయ్యాయి. దీంతో గడచిన 6 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు ఏకంగా 10 శాతం లాభపడి ఇన్వెస్టర్లపై లాభాల వర్షం కురిపించాయి. ఈరోజు ప్రధఆనంగా ఆటో, ఐటీ, ఫైనాన్షియల్ రంగాలకు చెందిన షేర్లలో భారీ కొనుగోళ్ల కోలాహలం కనిపించింది. ట్రంప్ ఓటమి వార్తలతో క్రూడ్ రేట్లు కూడా పడిపోయాయి. ఇవాళ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 94 డాలర్లు పలకటంతో దేశీయంగా దిగుమతుల భారం, ద్రవ్యోల్బణం భయాలు నెమ్మదించాయి. కేవలం ఈ ఒక్కరోజున ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.8 లక్షల కోట్లకు పైనే పెరిగింది.
3
Beranda
› 008 Points
› business
› Defeat for Trump’s Party in Midterm Elections
› Investor Wealth Increases by ₹8 Lakh Crore
› Major Relief for Global Stock Markets
› national
› Sensex Gains 2
› మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓటమి : ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు భారీ ఊరట : 2008 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ : రూ.8 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
Subscribe to:
Post Comments (Atom)
